ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, తన పై హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు, హై కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీలు మారడం అనేది వారిష్టమని అయితే ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి మరో పార్టీలో చేరి పదవుల్లో కొనసాగడం సరైంది కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
దీనితో ఖైరతాబాదా నియోజవర్గానికి ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి, దీనితో హైదరాబాద్ లో మరో ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఉప ఎన్నికల ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు, ఇప్పటికే బెంగాల్ లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ఖారారైన నేపధ్యంలో వాటితో పాటుగా ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు జరుగుతాయా లేకుంటే మరో తేదీని ఖరారు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపును పోటీచేసి గెల్చిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింధ్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు, అసెంబ్లీ రికార్డుల ప్రకారం దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందున తన పై అనర్హత వేయడాన్ని దానం నాగేందర్ వ్యతిరేకిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ లోకి మారిన దానం పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టును ఈ అంశాన్ని స్పీకర్ కు పంపింది.
అయితే దానం పార్టీ మారినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని అధికారిక రికార్డుల ప్రకారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారంటూ స్పీకర్ రూలింగ్ ఇవ్వడంతో దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ , బీజేపీ లు విడివిడిగా హైకోర్టును ఆశ్రయించగా దానం పై అనర్హత వేటు వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది వీటిని సవాలు చేస్తూ దానం సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు.
