గడ్డీఅన్నారం డివిజన్, గౌతమ్ నగర్ కాలనీ వినాయక మండపం వద్ద నిర్వాహకులు వివిధ రకాల హోమాలను నిర్వహించారు. గణపతి ,లక్ష్మి,సరస్వతి, నవగ్రహ, మృత్యుంజయ హోమాలతో సహా 10 రకాల హోమాలను నిర్వహించినట్టు గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళెం మధు సుధన్ రెడ్డి తెలిపారు.
భారతీయ సనాతన ధర్మంలో హోమాలకు ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని అగ్ని దేవుడిని మాధ్యమంగా చేసుకుని దేవతలకు ఆహుతులు సమర్పించడం వల్ల ప్రకృతిలో సానుకూల శక్తి పెరిగి, వర్షాలు కురిసి సమస్త ప్రాణికోటి సుభిక్షంగా ఉంటుందన్నారు. హోమద్రవ్యాలను అగ్నిలో వేయడం వల్ల గాలిలోని హానికారక బ్యాక్టీరియాను నశింపజేసి, వాతావరణాన్ని, పరిసరాలను శుభ్రపరుస్తుందన్నారు.హోమ సమయంలో ఉచ్చరించే వేద మంత్రాల కంపనాలు, అందులో వేసే ద్రవ్యాల సువాసన మనసులోని ఆందోళనలను తొలగించి, అంతఃకరణ శుద్ధిని, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని కళ్ళేం మధుసూధన్ రెడ్డి వివరించారు. పలువురు కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.https://janammata.net/le-chee-ka-raja-ganesh-2026-goshamahal-police-clarity/
జనంమాట – మీ గొంతు మా వేదిక
మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.
వివరాలకు:
E Mail: Satyamediasolutions@gmail.com
Phone Number: 97045 35591
