Janammata.net

కీసర సీఐ,ఎస్.ఐ అరెస్ట్

5 లక్షలతో పట్టుబడ్డ కీసర్ సీఐ,ఎస్.ఐ

ఏసీబీ అధికారల వలలో కీసర్ సీఐ,ఎస్.ఐ పడ్డారు. రేషన్ బియ్యం కేసులో నిందితుడు నుండి 5 లక్షల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రేషన్ బియ్యం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్ వ్యవహారానికి సంబంధించిన పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసిన పోలీసులు 5 లక్షలు తీసుకుంటూ దొరికిపోయారు.

    అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వచ్చిన సమయంలో హై డ్రామా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కీసరలోని చెరువు వద్ద వినాయక నిమజ్జన డ్యూటీలో ఉన్న ఎస్.ఐ జ్ఞానేందర్ రెడ్డి అక్కడే వచ్చి లంచానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని బాధితుడిని చెప్పాడు, సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు కూడా అక్కడికి రావడంతో వాళ్లను చూసి తప్పించుకుని పారిపోవడానికి ఎస్.ఐ ప్రయత్నించినట్టు తెలుస్తోంది, అయితే అధికారులు వెంబడించి ఎస్.ఐ. ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

     రేషన్ బియ్యానికి సంబంధించిన కేసులో కెమికల్ టెస్టులు చేయకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్టు బాధితుడు చెప్తున్నాడు. సీఐ రామాంజనేయిలు, ఎస్.ఐ. జ్ఞానేందర్ రెడ్డిలు 10 లక్షలు డిమాండ్ చేశారని అందులో భాగంగా ఐదు లక్షలు ఇస్తుండగా బాధితుడు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వారు వల పన్ని ఎస్.ఐ తో పాటుగా సీఐ ని కూడా అదుపులోకి తీసుకుని లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తనను పోలీసులు పలు రకాలుగా ఇబ్బందులు పెట్టారని బాధితుడు చెప్తున్నాడు. కెమికల్ టెస్టులు చేయించకుండా సతాయించడం, 10 లక్షలు ఇస్తేనే టెస్టులు చేయిస్తానన్నారని ప్రతీ రోజూ బిర్యానీలు, కూల్ డ్రింగ్ లు తీసుకుని రావాలంటూ ఒత్తిడి చేసేవారన్నారు.

     సాధారణంగా ఎసీబీ దాడులు పగటి పూట జరుగుతాయి కానీ ఈ కేసులో అర్థరాత్రి వేళ పథకం పన్నిన ఏసీబీ అధికారులు పోలీసులను పట్టుకున్నారు. ఎకంగా 5లక్షల రూపాయలతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం స్థానికంగా సంచలనం రేపింది. కేసును నమోదు చేసుకున్నామని విచారణలో మరిన్ని వివరాలు బయటికి వస్తాయని ఎసీబీ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా సరే నిర్భయంగా అవినీతికి సంబంధించిన వివరాలు తమకు అందిచవచ్చని చెప్పారు. అవసరం అనుకుంటే ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share
Exit mobile version