దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత,ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకుండా అడ్డుకుంటోందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా అన్యాయం జరుగుతోందని మధుయాష్కి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ, వాటికి తిరిగి వచ్చే నిధుల విషయంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్నారు.
రాముడి పేరుతో రాజకీయాలు చేయడం తప్ప దేశానికి బీజేపీ ఒరగబెడుతోంది ఏమీలేదని ఆయన దుయ్యబట్టారు, దేశ ప్రజలను మతం పేరుతో విడదీసి వారి మనసుల్లో విధ్వేషాన్ని నింపుతోందని మధుయాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణ నుండి ఎంపికైనా బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలం అయ్యారని, కేంద్రంలో తెలంగాణ మంత్రులు ఉన్నప్పటికీ వారి వల్ల మన రాష్ట్రానికి ఒరిగింది శున్యమని మధుయాష్కీ విమర్శించారు. భగ్యలక్ష్మీ అమ్మవారి పేరుతో రాజకీయాలు చేయడం మినహా బండి సంజయ్ తెలంగాణ కు చేసింది ఏమీ లేదన్నారు.
ఒక పక్క సర్ పేరుతో లక్షలాది మంది ఓటు హక్కును తొలగిస్తున్న బీజేపి ఎన్నికల సంఘాన్ని అడ్డంపెట్టుకుని గద్దెనెక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు, మరో వైపు లక్షలాది సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడం ద్వారా ప్రభుత్వం పై విమర్శలు చేసే నోళ్లు నొక్కుతూ కేంద్రంలోని మోడీ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మధుయాష్కీ గౌడ్ అన్నారు.
జనంమాట – మీ గొంతు మా వేదిక
మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.
వివరాలకు:
E Mail: Satyamediasolutions@gmail.com
Phone Number: 97045 35591
