Janammata.net

మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో దుసుకెళ్తున్న కాంగ్రెస్ : వక్కలంక

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఆయన అభినందనలు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువవుతూ బలపడుతుంటే, బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోందని వక్కలంక శ్రీనివాస్ విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా పట్టించుకోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లేలా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వక్కలంక శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉన్న Rangareddy District Congress రానున్న రోజుల్లో మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని వక్కలంక శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుండదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

https://janammata.net/sbi-jobs-2026-12000-recruitment-250-new-branches/

Please share
Exit mobile version