తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) ఫిబ్రవరి/మార్చి 2027 పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుండగా, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి జరగనున్నాయి.Telangana Inter Time Table 2027
మార్చి 20 వరకు పరీక్షలు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 19, 2027 వరకు జరగనున్నాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 20 వరకు నిర్వహించనున్నారు. జనరల్, ఒకేషనల్ విభాగాల విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ Telangana Inter Time Table 2027
| తేదీ | పరీక్ష / సబ్జెక్టు |
|---|---|
| ఫిబ్రవరి 24 | రెండో భాష పేపర్-1 |
| ఫిబ్రవరి 26 | ఇంగ్లీష్ పేపర్-1 |
| మార్చి 2 | మ్యాథ్స్-IA, బోటనీ, పొలిటికల్ సైన్స్ |
| మార్చి 5 | మ్యాథ్స్-IB, జువాలజీ, హిస్టరీ |
| మార్చి 9 | ఫిజిక్స్, ఎకనామిక్స్ |
| మార్చి 15 | కామర్స్ అండ్ అకౌంటెన్సీ, కెమిస్ట్రీ |
| మార్చి 17 | మ్యాథ్స్ (MEC), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ |
| మార్చి 19 | జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ |
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
| తేదీ | పరీక్ష / సబ్జెక్టు |
|---|---|
| ఫిబ్రవరి 25 | రెండో భాష పేపర్-2 |
| ఫిబ్రవరి 27 | ఇంగ్లీష్ పేపర్-2 |
| మార్చి 3 | మ్యాథ్స్-IIA, బోటనీ, పొలిటికల్ సైన్స్ |
| మార్చి 8 | మ్యాథ్స్-IIB, జువాలజీ, హిస్టరీ |
| మార్చి 12 | ఫిజిక్స్, ఎకనామిక్స్ |
| మార్చి 16 | కెమిస్ట్రీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ |
| మార్చి 18 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ |
| మార్చి 20 | మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ |
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ప్రకటించింది.
- సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు.
- ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు.
- ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష: జనవరి 27.
- ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష: జనవరి 29.
- ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష: జనవరి 30.
అధికారిక వెబ్‌సైట్‌లో టైమ్‌టేబుల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి IPE మార్చి 2027 టైమ్‌టేబుల్ PDFను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని News and Announcements విభాగంలో టైమ్‌టేబుల్ లింక్‌ను పరిశీలించాలి.
అధికారిక వెబ్‌సైట్: https://tgbie.cgg.gov.in/
విద్యార్థులు పరీక్షల తేదీలను గమనించి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలని, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా సబ్జెక్టుల వారీగా చదువుకునే ప్రణాళిక రూపొందించుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
Telangana Inter Time Table 2027
