August 20, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

కాంగ్రెస్ పై మండిపడ్డ అమిత్ షా…

వందేమాత గీతంలో రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పై అమిత్ షా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ చర్యగా ఆయన అభివర్ణించారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, పార్టీ కార్యక్రమాల్లో “వందే మాతరం”లోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. ఇందుకు 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆధారంగా చూపుతోంది.

అమిత్ షా ఆరోపణల ప్రకారం, 1937లో కాంగ్రెస్ “వందే మాతరం”ను రెండు భాగాలుగా విభజించి, ముస్లిం వర్గాల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక విధానాన్ని అనుసరించింది. ఈ నిర్ణయం తరువాత దేశ విభజనకు దారితీసిన రాజకీయ పరిస్థితులకు కూడా కారణమైందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా గతంలో చేసిన అదే “బుజ్జగింపు రాజకీయాలను” మళ్లీ కొనసాగిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. దేశభక్తి, జాతీయ భావనలకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి రాజకీయాలకు ఇకపై స్థానం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.