November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

కొత్తపేట టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

గతంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో నిర్మిస్తున్న ఎల్.బి.నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కోరుతున్నాను.

ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఎల్.బి.నగర్‌తో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా అటు నల్గొండ, ఇటు రంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో అన్ని రకాల ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు మరియు అవసరమైన వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేలా ఆస్పత్రిని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నాను.

— సరస్వతి, నాగోల్

Please share