హైదరాబాద్ మినహా తగ్గిన ఇళ్ల విక్రయాలు
దేశంలోని ప్రధాన నగరాల రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు కొంత మందగించాయి. 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎనిమిది కీలక నగరాల్లో మొత్తం 91,729 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 97,674 యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 6 శాతం తగ్గాయి. ఈ వివరాలను ప్రాప్‌టైగర్ (PropTiger) తాజా ‘రియల్ ఇన్సైట్’ నివేదికలో వెల్లడించింది.
ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో ఇళ్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి.
- MMRలో అమ్మకాలు 7 శాతం తగ్గి 24,112 యూనిట్లకు చేరాయి.
- ఢిల్లీ-ఎన్సీఆర్లో 7 శాతం తగ్గి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.
- బెంగళూరులో 9 శాతం తగ్గి 14,186 ఇళ్లకు పరిమితమయ్యాయి.
- పుణెలో 21 శాతం క్షీణించి 12,642 యూనిట్లకు చేరాయి.
- అహ్మదాబాద్‌లో 20 శాతం తగ్గి 7,541 ఇళ్లు అమ్ముడయ్యాయి.
- కోల్‌కతాలో 9 శాతం తగ్గుదలతో విక్రయాలు 3,517 యూనిట్లుగా నమోదయ్యాయి.
అయితే మన భాగ్యనగరంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్-జూన్ మధ్య 13,196 ఇళ్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 11,513 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం పెరిగింది.
