November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

దాడులు చేసుకున్న కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు

హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూవజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు దాడిచేయడం దానికి ప్రతీకారంగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ పై దాడికి ప్రయత్నించడంతో నాంపల్లి ప్రాంతం అడ్డుడిగిపోయింది.

అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే పై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ యుజవన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. ఖర్కే పాల్గొన్న కార్యక్రమం అనంతరం వేదికను శుద్దిచేయడం వ్యక్తిగతంగా ఖర్కేతో పాటుగా దళితులను అవమాన పర్చడమే అంటూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో రెచ్చిపోయిన కొంత మంది కార్యకర్తలు బీజేపీ కార్యలయం గేటుకు నల్ల రంగును పులిమి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలను వారు దగ్దం చేశారు.ఒక్కసారిగా దూసుకుని వచ్చి కార్యకర్తలను పోలీసులు అదుపు చేయలేకపోయారు.

తమ పార్టీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పార్టీ ఆఫీస్ కు చేరుకుని గాంధీ భవన్ వైపు దూసుకుని పోయారు, అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిలువరించారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యాలయంపై దాడి జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు తమను మాత్రం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ జెండాలను బీజేపీ కార్యకర్తలు చింపేశారు.

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కార్యకర్తలు వారి వారి కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వస్తుందడంతో పోలీసులు బలగాలు ఇరువర్గాలను అదుపు చేశాయి. పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు బలగాలను తరలించారు.

Please share