అర్మీ ఆయుధగారంలో చోరీ
సైనిక ఆయుధగారం నుండి తుపాకులు చోరీ అయిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ లోని బొల్లారంలో ఉండే ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ కు చెందిన ఆయుధాలను బద్రపర్చే గది నుండి నాలుగు ఏకే -47, ఆరు సిప్టల్స్, ఒక రైఫిల్ చోరీ అయ్యాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఆర్మీ రెజిమెంట్ నుండి ఆయుధాలు చోరీ అయ్యాయి. ఈ ఆప్రాంతం పూర్తిగా సైనికి దళాల పర్యవేక్షణలో ఉంటుంది, సైనికులు వారి అనుమతి ఉన్నవారు మినహా ఇతరులు ఈ ప్రాంతంలోకి వచ్చే అవకాశం లేదు. అట్లాంటి చోట ఆయుధాలను భద్రపర్చిన గది తాళాలను పగుల గొట్టి వాటిని ఎత్తుకుని పోవడం కలకలం రేపుతోంది.
ఇది పూర్తిగా ఇంటిదొంగల పనేనని సైనిక అధికారులు అనుమానిస్తున్నారు, ఆయుధాల చోరీకి సంబంధించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తుండగా అటు ఆర్మీ అధికారులు కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఇటు పోలీసులు, ఆటు ఆర్మీ అధికారులు కూడా అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం లేదు.
