తిరుమల మెట్ల దారిలో చిరుత సంచారం
ఫైల్ ఫొటో Photo by Giles Laurent, licensed under CC BY-SA 4.0. via https://commons.wikimedia.org/wiki/File:001_Juvenile_leopard_in_the_Serengeti_National_Park_Photo_by_Giles_Laurent.jpg
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది, అలిపిరి మెట్లమార్గంలోని 2754 మెట్టు వద్ద ఒక చెట్టుపై ఈ చిరుతను గమనించిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు, సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఒంటరిగా వెళ్లవద్దని గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించడంతో పాటుగా చిరుతను అడవిలోకి పంపేశారు. తిరిగి చిరుత నడమార్గం వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల మెట్ల మార్గంలో అడవి జంతువుల సంచారం పెరిగింది, గతంలో ఒక చిన్నారిపై చిరుత దాడిచేసిన ఘటన తెలిసిందే. తిరుమల మెట్ల మార్గంలో వెళ్లేసమయంలో భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ, అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లాలని, మెట్ల మార్గం నుండి లోపలికి వెళ్లడం ప్రమాదకరమని వారు చెప్తున్నారు. మరో వైపు మెట్ల మార్గం గుండా భక్తులు కొంత మంది అడవి జంతువులకు ఆహారం అందిస్తున్నారు, ఆ ఆహారం కోసం పెద్ద సంఖ్యలో జంతువులు మెట్ల మార్గానికి సమీపానికి వస్తున్నాయి అట్లా వచ్చే జింకలు ఇతర జంతువల కోసం క్రూర మృగాలు కూడా వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.
అటవీ జంతువులకు ఆహారం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడం సాధ్యంకావడం లేదనేది అధికారుల వాదన, అటవీ జంతువుల విషయంలో భక్తులకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. https://janammata.net/dance-with-paython/https:
