November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కు స్వర్ణం

ఫైల్ ఫొటో Photo: Tony Hisgett via Wikimedia Commons / CC BY 2.0. https://commons.wikimedia.org/w/index.php?search=indian+womens+cricket+team&title=Special%3AMediaSearch&type=image

భారత మహిళా క్రికెట్ జట్టు ఆసీయా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసి 79 పరుగులు సాధించగా, షెఫాలీ వర్మ 48 పరుగులు చేసింది. రిచా ఘోష్ చివర్లో దూకుడుగా ఆడి 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీనితో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు ను నమోదు చేసింది. ఇది ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో భారత్ సాధించిన అత్యధిక స్కోరుగా నిలిచింది. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. 69 పరుగులకే ఆలౌటై, 147 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. షెఫాలీ వర్మ, శ్రేయాంక పాటిల్ లు చెరో రెండు వికెట్లు సాధించారు.

ఈ విజయంతో భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించినట్టయుంది. 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని మహిళా క్రికెట్ జట్టు అందించింది.

సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరగా, శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ పోరుకు వచ్చింది. https://janammata.net/le-chee-ka-raja-ganesh-2026-goshamahal-police-clarity/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share