39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
బాలాపూర్ లడ్డు ఏఐ చిత్రం
బాలాపూర్ లడ్డును సాహెబ్ నగర్ వాసి సామా ప్రణీత్ రెడ్డి 39 లక్షలకు దక్కించుకున్నారు, దక్కించుకున్నారు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో లడ్డూ వేలం అంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డునే. ఇతర ప్రాంతాల్లో ఎన్ని వేలంపాటలు జరిగినా అందరి దృష్టి బాలాపూర్ పైనే ఉంటుంది.బాలాపూర్ లడ్డూ అంటే కేవలం ఒక మిఠాయి కాదు. గణపయ్యకు నైవేద్యంగా సమర్పించి, పూజలు నిర్వహించిన ప్రసాదం. దానిపై భక్తుల్లో ఎంతో నమ్మకం ఉంది. ఇంటికి తీసుకెళ్తే శుభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. కొందరు కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచుకుంటారు. మరికొందరు ఇంట్లో పూజిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయనే నమ్మకం ఉంది. లడ్డూను సొంతం చేసుకున్న వారు దాన్ని ప్రసాదంగా స్వీకరించడంతో పాటుగా తమ పొలాల్లో చల్లడాన్ని చూస్తుంటాం. లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్ము వినాయక ఉత్సవాలతో పాటుగా సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు.
బాలాపూర్ లో లడ్డూ వేలం 1994 నుండి మొదలైంది…
బాలాపూర్‌లో గణేశ్ ఉత్సవాలకు 1980లో శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో స్థానికులంతా కలిసి ఉత్సవాలను నిర్వహించేవారు. కాలం గడిచేకొద్దీ ఉత్సవాల స్థాయి పెరిగింది. బాలాపూర్ గణేశ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే 1994లో జరిగిన లడ్డూ వేలం బాలాపూర్ ఉత్సవాల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీసింది. అదే ఏడాది తొలిసారి లడ్డూను వేలం వేశారు. స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి 450 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆ మరుసటి ఏడాది కూడా ఆయనే వేలంలో పాల్గొని 4 వేల 500 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
ఇప్పటి వరకు లడ్డూలను సొంతం చేసుకున్న వారి వివరాలు ఒకసారి చూద్దాం.
1994 – కొలను మోహన్‌రెడ్డి – రూ.450
1995 – కొలను మోహన్‌రెడ్డి – రూ.4,500
1996 – కొలను కృష్ణారెడ్డి – రూ.18,000
1997 – కొలను కృష్ణారెడ్డి – రూ.28,000
1998 – కొలను మోహన్‌రెడ్డి – రూ.51,000
1999 – కళ్లెం అంజిరెడ్డి – రూ.65,000
2000 – కళ్లెం ప్రతాప్‌రెడ్డి – రూ.66,000
2001 – జి. రఘునందన్‌చారి – రూ.85,000
2002 – కందాడ మాధవరెడ్డి – రూ.1.05 లక్షలు
2003 – చిగిరింత బాల్‌రెడ్డి – రూ.1.55 లక్షలు
2004 – కొలను మోహన్‌రెడ్డి – రూ.2.01 లక్షలు
2005 – ఇబ్రహీం శేఖర్ – రూ.2.08 లక్షలు
2006 – చిగిరింత తిరుపతిరెడ్డి – రూ.3 లక్షలు
2007 – జి. రఘునందన్‌చారి – రూ.4.15 లక్షలు
2008 – కొలను మోహన్‌రెడ్డి – రూ.5.07 లక్షలు
2009 – సరిత – రూ.5.10 లక్షలు
2010 – కొడాలి శ్రీధర్‌బాబు – రూ.5.35 లక్షలు
2011 – కొలను బ్రదర్స్ – రూ.5.45 లక్షలు
2012 – పన్నాల గోవర్ధన్‌రెడ్డి – రూ.7.50 లక్షలు
2013 – తీగల కృష్ణారెడ్డి – రూ.9.26 లక్షలు
2014 – సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి – రూ.9.50 లక్షలు
2015 – కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి – రూ.10.32 లక్షలు
2016 – కందాడి స్కైలాబ్‌రెడ్డి – రూ.14.65 లక్షలు
2017 – నాగం తిరుపతిరెడ్డి – రూ.15.60 లక్షలు
2018 – తేరేటిపల్లి శ్రీనివాస్‌గుప్తా – రూ.16.60 లక్షలు
2019 – కొలను రాంరెడ్డి – రూ.17.60 లక్షలు
2020 – కరోనా కారణంగా సాధారణ వేలం జరగలేదు
2021 – రమేష్‌యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి – రూ.18.90 లక్షలు
2022 – వంగేటి లక్ష్మారెడ్డి – రూ.24.60 లక్షలు
2023 – దాసరి దయానంద్‌రెడ్డి – రూ.27 లక్షలు
2024 – కొలను శంకర్‌రెడ్డి – రూ.30.01 లక్షలు
2025 – లింగాల దశరథ్‌గౌడ్ – రూ.35 లక్షలు.https://janammata.net/hyderabad-ganesh-2/
