November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

దాదాపు 2 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్

ఈ మార్చి నుంచి జూలై వరకు ఐదు నెలల్లో దాదాపుగా 2 లక్షల సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసింది. ప్రధానంగా ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, యూట్యూల అకౌంట్లను మూసివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన రోజుకు సగటున 1,275 పోస్టులపై ఆదేశాలు జారీ అయినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిలో ఇన్ స్టా గ్రాం లోనే అత్యధికంగా దాదాపు లక్ష అకౌంట్లపై కేంద్ర నిషేధం విధించగా ఫేస్ బుక్ కు సంబంధించిన 80వేల అకౌంట్లు, యూ ట్యూబ్ కు సంబంధించిన 15వేల అకౌంట్ల పై కేంద్రం నిషేధం విధించింది.

    2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు ప్రభుత్వం  19 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు మొత్తం 2,312  అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనితో పోలిస్తే 2026 మార్చి–జూలైలో ఐదు నెలల్లోనే 1.95 లక్షల ఆదేశాలు రావడం విశేషం. ఒక్క బ్లాకింగ్ ఆదేశం తో  వందల పోస్టులు, వీడియోలు లేదా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సయ్యోగ్  పోర్టల్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

     2026 ఫిబ్రవరిలో చేసిన IT Rules సవరణల ప్రకారం, సంబంధిత ప్రభుత్వ అధికారి లేదా కోర్టు ఆదేశించిన తర్వాత సోషల్ మీడియా మధ్యవర్తులు “చట్టవిరుద్ధమైన కంటెంట్”ను మూడు గంటల్లో తొలగించాల్సి ఉంటుంది. Meta తన APIని Sahyog పోర్టల్‌తో అనుసంధానించడంతో, ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఫ్లాగ్ అయిన కంటెంట్‌ను ప్రత్యేక మానవ పరిశీలన లేకుండానే Meta ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించే విధానాన్ని అభివృద్ది చేశారు. ఈ ఆదేశాల్లో ఎక్కువ భాగం Information Technology Act, 2000లోని Section 79(3)(b) కింద జారీ అయినట్టు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఎక్కువగా బ్లాక్ చేసిన కంటెంట్ ఏది?

సోషల్ మీడియాలో  బ్లాక్ చేసిన కంటెంట్ ను గనుక ఒకసారి పరిశీలిస్తే

  • విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఉన్న పోస్టులు
  • ప్రభుత్వ ఇథనాల్-ఇంధన మిశ్రమ విధానంపై విమర్శలు
  • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కంటెంట్
  • డీప్‌ఫేక్‌లు

ఎక్కువగా ఉన్నాయి.

ప్రతిపక్షం విమర్శలు

ఈ స్థాయిలో బ్లాకింగ్ ఆదేశాలు రావడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే కంటెంట్‌పై టేక్‌డౌన్‌లు, FIR నోటీసులు, ఇతర ఒత్తిళ్లు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగిస్తోందని ఆయన మండిపడ్డారు.https://janammata.net/mlc-elections/

Please share