ఇజ్రాయిల్ కు వెళ్తున్న విమానం హైజాక్ కు యత్నం?
ఏఐ చిత్రం
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానం ను హైజాగ్ చేయడానికి లేదా కూల్చివేయాడానికి ప్రయత్నాలు జరిగినట్టు ఇజ్రాయిల్ అనుమానిస్తోంది. పైలెట్ పై కో పైలెట్ కత్తితో దాడిచేసి విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలు చేసినట్టు ప్రధామిక సమాచారం, కో – పైలెయ్ యమన్ జాతీయుడు కావడంతో ఉగ్రవాద కుట్రకు బలం చేకురూతోంది. విమానం గాల్లో ఉండగానే కాక్ పిట్ లో ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘర్షణలో కో-పైలెట్ ఒకరు పైలెట్ పై కత్తితో దాడిచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి, అయితే ఇజ్రాయిల్ అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే కత్తిపోట్లకు గురైన వ్యక్తి భారత సంతతి కి చెందిన వాడిగా తెలుస్తోంది.
పైలెట్ పై దాడి అనంతరం విమానం ఒక్కసారిగా భారీగా కిందికి దిగింది. అనంతరం అత్యవసర సంకేతాలు పంపి సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 174 నుంచి 180 మంది ఉన్నట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. అందరూ సురక్షితంగా ఉన్నారని ఫ్లై దుబాయ్ వెల్లడించింది.
అసలేం జరిగింది?
విశ్వసనీయ సమాచారం ప్రకారం, విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వైపు వెళ్తుండగా ఒక పైలెట్‌పై మరొకరు కత్తితో దాడి చేసినట్లు ప్రయాణికులు చెప్పినట్టు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఒక పైలెట్ తీవ్రంగా గాయపడటంతో పాటు విమానం నియంత్రణలో కూడా కొంతసేపు సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన సమయంలో విమానం సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ఉండగా, కేవలం కొద్దిసేపట్లోనే దాదాపు 17 వేల అడుగుల మేరకు అకస్మాత్తుగా కిందికి దిగినట్లు విమాన ట్రాకింగ్ డేటా సూచించింది. దీంతో విమానంలో ఉన్నవారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. విమానం తొలుత సాధారణ అత్యవసర సంకేతం 7700 పంపినట్లు, అనంతరం 7500 అనే ‘హైజాకింగ్/అనధికార జోక్యం’ సంకేతం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ అధికారులు విమానం హైజాక్ అయి ఉండవచ్చన్న అనుమానంతో అప్రమత్తమయ్యారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేసినట్లు రాయిటర్స్ వార్త సంస్థ తెలిపింది.
కో-పైలెట్ కత్తితో దాడి చేశాడా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, కో-పైలెట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు అనుమానిస్తున్నారు. కో-పైలెట్ ఒమన్‌కు చెందిన వ్యక్తి అని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి కారణం, కో-పైలెట్ ఉద్దేశం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం దాడికి గురైన కెప్టెన్ భారతీయుడు లేదా భారతీయ మూలాలున్న వ్యక్తి అని పేర్కొంటున్నాయి. అయితే ఫ్లై దుబాయ్ లేదా ఇతర అధికారిక సంస్థలు కెప్టెన్ భారతీయుడనే విషయం ఇంకా వెల్లడించలేదు.
ఆఫ్-డ్యూటీ పైలెట్లు నిజంగానే విమానాన్ని దింపారా?
ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, అదే విమానంలో ఆఫ్-డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు పైలెట్లు ప్రయాణికులుగా ఉన్నారు. వారు సాధారణ దుస్తుల్లో విమానంలో ప్రయాణిస్తున్నారని, కాక్‌పిట్‌లో జరిగిన ఘటన తర్వాత వారు ముందుకు వచ్చి విమాన నియంత్రణలో సహకరించారని చెబుతున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌కు సురక్షితంగా దించడంలో వారు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు
మొదట ఈ ఘటనను పైలెట్ల మధ్య జరిగిన ఘర్షణగా పరిగణించినప్పటికీ, పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇప్పుడు విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చే ప్రయత్నం జరిగిందా? అనే కోణంలో ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఒక పైలెట్ మరో పైలెట్‌పై దాడి చేసి విమానాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాడా, విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చే ఉద్దేశం ఉందా అనే అంశాలపై విచారణ
సౌదీలో ల్యాండింగ్
విమానం ఇజ్రాయెల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకోవడంతో, దానిని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత గాయపడిన ఇద్దరు పైలెట్లను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు, ఫ్లై దుబాయ్ వెల్లడించింది ఇజ్రాయెల్–సౌదీ అరేబియాల మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేకపోయినప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన విమానాన్ని తమ భూభాగంలో దించడానికి అంగీకరించినట్టు సౌదీ తెలిపింది ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తాము విమానం దిగడానికి అనుమతించినట్టు సౌదీ అదికారులు వెళ్లడించారు. కాక్‌పిట్ వైపు నుంచి అరుపులు వినిపించాయని, అనంతరం రక్తం కనిపించిందని కొందరు ప్రయాణికులు ఇజ్రాయెల్ మీడియాకు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో ప్రయాణికులు కాక్‌పిట్ వైపు వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం కూడా పరిస్థితి అదుపులో ఉందని, సౌదీలో ఉన్న ఇజ్రాయెల్ ప్రయాణికులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
