Janammata.net

నాగోల్ బండ్లగూడ లో దారుణ హత్య

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బండ్లగూడ లో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన నయీమ్ అనే రౌడీషీటర్‌ను వెంబడించి కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నయీమ్‌పై దాడి చేసిన వ్యక్తులు అతడిని వెంబడించగా, ప్రాణభయంతో సమీపంలోని సుప్రీమ్ వైన్స్‌ పర్మిట్ రూమ్‌లోకి వెళ్లాడు. అయినప్పటికీ దుండగులు అక్కడికీ చేరుకుని అతడిపై దాడి చేశారు. కత్తులు, వేటకొడవళ్లతో పాటు మద్యం సీసాలు, అక్కడి వంట సామగ్రితో కూడా దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో నయీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ హత్యకేసులో అనుమాతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, నయిమ్ స్నేహితుడు మహేశ్ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గతంలో మంచి మిత్రులని అయితే సెటిల్ మెంట్ల ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నయిమ్ కొద్ది రోజులుగా స్థానికంగా ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడని అతని కదలికలపై నిఘా ఉంచిన నిందుతులు పక్క ప్రణాళిక ప్రకారం హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్ తో పాటుగా మరో ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఈ హత్య నాగోల్ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. https://janammata.net/hit-and-run-case/

Please share
Exit mobile version