November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

భూ భారతి కాదు భూహారతి: హరీశ్ రావు

భూ భారతి స్కాంను బీఆర్ఎస్ బయటపెడితే దాని గురించి విచారణ దమ్ము రేవంత్ రెడ్డి లేదని బీఆర్ఎల్పీ ఉప నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందల ఎకరాల భూములు 22ఏ జాబితాలో చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రెవంత్ రెడ్డి తమపై ఎదురుదాడి చేయడం ఏమో సాధించాం అనుకుంటున్నారని , అయితే ఆయన సాధించింది ఏమీ లేదని హరీశ్ రావు అన్నారు. హామీల సమాధానం చెప్పే ధైర్యం లేక ముఖ్యమంత్రి విమర్శలతో కాలంగుడుపుతున్నారని మండిపడ్డారు.

తమ ఆస్తులను గురించి మాట్లాడుతున్న సీఎం అవన్నీ తాము ఎన్నికల అఫడవిట్ లో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ వివరాలు బహిరంగంగానే వెల్లడించామని గుర్తు చేశారు. తాము అఫడవిట్ చెప్పనివి ఒక్కటి కూడా లేదన్నారు. అధికారులు చూడకుండా నిషేధిక జాబితాలో పెట్టారంటూ తప్పంతా అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని నిజంగా అధికారులే తప్పు చేసిఉంటే వారి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. భూ భారతి అనేది భూ హరతిగా మారిందని రాత్రికి రాత్రి అసలు యజమానులకు తెలీకుండా ఆస్తులు వేరే వాళ్ల పేర్ల పైకి వస్తున్నాయని ఈ విషయాన్ని రుజువు చేసినా దానిపై మాట్లాడే ధైర్యం చేయని ముఖ్యమంత్రి తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 22ఏ కింద మూడు లక్షల ఎకరాలు ఉంటే అది కాస్తా 30 లక్షల ఎకరాలకు ఎట్లా చేరిందన్నారు. సీఎం ఆస్తులను 22ఏ కింద మారిస్తే మంత్రి పదవి ఉంటుందా అంటూ అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ని తమ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చినందుకు ప్రజలు ఇంటికి పంపీయడం ఖాయమన్నారు.

Please share