Janammata.net

కొండా దంపతుల భవిష్యత్తు ఏంటి?

ఊహించినట్టుగానే కొండా సురేఖను ముఖ్యమంత్రి బర్తరఫ్ చేశారు, కొండా సురేఖతో పాటుగా మాజీ మంత్రి ప్రానింగ్ బోర్టు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి పై కూడా ముఖ్యమంత్రి వేటు వేశారు. మంగళవారం ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా సాగిన మంతనాల తరువాత వీరిద్దరిపై ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి వేటు వేశారు. బర్తరఫ్ తరువాత కొండా సురేఖ మాట్లాడుతూ తనను తొలగించడం కాంగ్రెస్ హై కమాండ్ కు ఇష్టం లేకపోయినా సీఎం గట్టిగా పట్టుబట్టడంతో తో పాటుగా బ్లాక్ మెయిల్ చేయడంతో తనను మంత్రి పదవి నుండి తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇప్పుడు కొండా దంపతులు రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది ఆశక్తికరంగా మారింది, ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ చెప్తున్నప్పటికీ వాస్తవానికి అటువంటి పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.  కొండా దంపతులుపార్టీ మారడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. అయితే వీరు ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇంకా స్పష్టత లేకున్నా బీజేపీలో వీరి చేరిక లాంఛనం అని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిన తరువాత వారు ఆ పార్టీపై వ్యక్తిగతంగా కేటీఆర్ పై విపరీతమైన ఆరోపణలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి బీఆర్ఎస్ తలుపులు వీళ్లకి మూసుకుని పోయినట్టే …

     ప్రస్తుతానికి వీరికి మిగిలింది బీజేపీనే, ఇప్పటికే ధర్మపురి అరవింద్ లాంటి నేతల కొండా దంపతులతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బలమైన క్యాడతో పాటుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరిని పార్టీలోకి తీసుకుని రావడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని అర్వింద్ రెడ్డి పార్టీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా ఉప ఎన్నిక వస్తే దాంట్లో సత్తా చాటడం ద్వారా బీజేపీకి తెలంగాణలో ఊపు వస్తుందని పార్టీ నేతలు కొందరి భావిస్తున్నట్టు సమాచారం. గతంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెరిన తరువాత కూడా కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. నాడు పరకాల నుండి పోటీచేసిన ఆమె ఓటమి పాలయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం లేదని కూడా భావిస్తున్నారు.

     ఆది నుండి వివాదాస్పద వ్యక్తులుగా ముద్రపడ్డ కొండా దంపతులను పార్టీలో చేర్చుకోవడం వల్ల కొత్త తలనొప్పులు వస్తాయని అదే పార్టీలోని మరొక వర్గం వాదిస్తున్నట్టు తెలుస్తోంది. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కొండా దంపతులు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చుకుంటారని, వారి నిలకడ లేని తనం వల్ల పార్టీ నష్టపోవాల్సి వస్తుందని వీరి రాకను వ్యతిరేకించే వర్గం వాదిస్తున్నట్టు తెలుస్తోంది.

కొండా సురేఖ వ్యవహారాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా ఆశక్తిగా గమనిస్తున్నరు. వారు తమ పార్టీలోకి వచ్చే అవకాశం లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో రేగిన చిచ్చు తమకు కలిసివస్తుందని వాళ్లు గట్టినమ్మకంతో ఉన్నారు.

Please share
Exit mobile version