Janammata.net

గరిష్ట భూ పరిమితి చట్టం గురించి మీకు తెలుసా

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22ఏ పై మాట్లాడుతున్న సందర్భంలో గరిష్ట భూ పరిమితి చట్టం గురించి ప్రస్తావించడంతో అసలు ఈ చట్టం గురించి చర్చ తెలంగాణలో విస్తృతంగా జరుగుతోంది. ‘తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ (సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్) యాక్ట్, 1973’ గురించిన వివరాలను ఒకసారి చూద్దాం.. ఈ చట్టం తెలంగాణలో పూర్తిగా స్థాయిలో అమల్లోనే ఉంది… దీని ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబాన్ని ఒక ‘యూనిట్’ గా పరిగణిస్తారు, ఇక్కడ కుటుంబం అంటే ఐదురుగు వ్యక్తులు.

     దీని ప్రకారం ఒక కుటుంబం గరిష్టంగా మెట్ట అయితే 35 నుండి 54 ఎకరాలు వరకే కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఈ మెట్టను ఎండ్రభూమి అనికూడా అంటారు, మెట్టా అనేది ఎటువంటి నీటి వసతి లేకుండా వర్షలపైనే ఆధారపడే పొలం.. నీటి పారుదల ఉన్న భూమి అంటే కాలువలు, కెనాల్స్ సౌకర్యం ఉన్న భూమి 10 నుండి 27 ఎకరాలను మాత్రమే ఒక యూనిట్ (కుటుంబం) కలిగిఉండాలి. నీటి వనరుల ద్వారా నిరంతరం సాగు నీరు అందే పొలాలు ఈ కోవకు చెందితాయి. సాగునీటి వసతి గణనీయంగా ఉండి సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలు అయితే ఒక కుటుంబానికి పది ఎకరాలకు మించి ఉండకూడదు.

గరిష్ట భూ పరిమితి చట్టం నిర్ధేసించిన దాని కంటే అదనపు భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. అట్లా సేకరించిన అదనపు భూమిని ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు పంచాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఈ చట్టం గురించి ప్రజల్లో ఎక్కువ అవగాహన లేకపోవడంతో ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తరువాత దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.https://janammata.net/keesara/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share
Exit mobile version