November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

స్వదేశీ వ్యాపారి మంచ్ తెలంగాణ కన్వీనర్‌గా దడిగం రామ్ సుధాకర్ శర్మ

స్వదేశీ వ్యాపారి మంచ్ (SVM) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా దడిగం రామ్ సుధాకర్ శర్మ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీమ్-11 సభ్యుడిగా సుబోధ్ గుప్తా ఎంపికయ్యారు, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన స్వదేశీ వ్యాపారి మంచ్ జాతీయ సదస్సులో వీరిని ఎన్నుకున్నారు.భోపాల్‌లోని ఎంపీ సైన్స్ ఆడిటోరియంలో జరిగిన ఈ రెండు రోజుల జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM), స్వదేశీ వ్యాపారి మంచ్ (SVM)కు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ స్పూర్తితో, స్వదేశీ జాగారణ మంచ్ ప్రేరణతో స్వదేశీ వ్యాపారి మంచ్‌ ఏర్పాటయింది. సదస్సుకు స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారత సంఘటక్ శ్రీ కాశ్మీరీ లాల్ జీ, అఖిల భారత సహ సంఘటక్ శ్రీ సతీష్ కుమార్ జీ, ఎస్.వి.ఎం. అ ఖిల భారత కన్వీనర్ శ్రీ బాలకృష్ణ భార్తియా, అఖిల భారత సంపర్క్ అధికారి శ్రీ అజయ్ పాట్కీ, స్వర్ణిమ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ చావ్లా, ఫౌండేషన్ సీఈఓ సాకేత్ సింగ్ రాఠోడ్, ఎస్.వీ.ఎం అఖిల భారత కో-కన్వీనర్ వ్యాపారి సందీప్ బన్సల్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్.వీ.ఎం అఖిల భారత సహ ప్రముఖ్ శ్రీ మనోహర్ లాల్ అగర్వాల్ సదస్సుకు అధ్యక్షత వహించి మార్గనిర్దేశం చేశారు. ఎస్.జే.ఎం ఢిల్లీ కార్యాలయ ఇన్‌చార్జ్ రాకేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు మూడో సెషన్‌లో ఎస్.వీ.ఎం అఖిల భారత కన్వీనర్ శ్రీ బాలకృష్ణ జీ సంస్థ విజన్, మిషన్, లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు.

మొదటి రోజు నాలుగో సెషన్‌కు చాందినీ చౌక్ ఎంపీ శ్రీ ప్రవీణ్ ఖండేల్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాపారుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తున్న తాను స్వదేశీ జాగరణ్ మంచ్ కార్యకర్తనని ఆయన తెలిపారు. అలాగే రెండో రోజు రెండో సెషన్‌లో కేంద్ర ప్రభుత్వ వ్యాపారి కళ్యాణ్ నేషనల్ బోర్డు చైర్మన్, కేబినెట్ హోదా కలిగిన శ్రీ సునీల్ సంఘ్వీ పాల్గొన్నారు. బోర్డు సభ్యులు ఆర్.కే. గౌడ, రాజీవ్ అనేజా తదితరులు కూడా సదస్సుకు హాజరయ్యారు.

వ్యాపారుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై చర్చ

సదస్సులో హాకర్లు, చిన్న వ్యాపారులు, రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారుల సంక్షేమం, అభివృద్ధి, వృద్ధి, వారి సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. వ్యాపారులకు హ్యాండ్‌హోల్డింగ్, మెంటరింగ్, అవసరమైన సహాయ సహకారాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.

దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఎస్.వీ.ఎం విస్తృత లక్ష్యాలతో పనిచేయనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ, నాగ్‌పూర్ కేంద్రాల నుంచి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.

‘రాష్ట్ర హితం – వ్యాపారి హితం – వినియోగదారుల హితం’ అనే లక్ష్యంతో పాటు స్వదేశీ ఆలోచన, ఆత్మనిర్భర్ భారత్, వ్యాపారంలో ‘శుభ్ లాభ్’ విధానాలను ప్రోత్సహించడం ఎస్.వీ.ఎంప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ONDC/ONDP తరహా డిజిటల్ వాణిజ్య అవకాశాలను వ్యాపారులకు చేరువ చేయడం, ఆన్‌లైన్ వ్యాపారంలో వారికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.

తెలంగాణ నుంచి ముగ్గురు ప్రతినిధులు

తెలంగాణ నుంచి దడిగం రామ్ సుధాకర్ శర్మ, సుబోధ్ గుప్తా, వంశీకృష్ణ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి డి. ప్రసాద్ రెడ్డి, మురళీకృష్ణ హాజరయ్యారు.

ఆగస్టు 31న అన్ని రాష్ట్రాల SVM బృందాల ప్రకటనలో భాగంగా అజయ్ పాట్కీ వివిధ రాష్ట్రాల ప్రతినిధుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాశ్మీరీ లాల్ జీ, సతీష్ కుమార్ జీ, మనోహర్ లాల్ జీ, సునీల్ సంఘ్వీ తదితర జాతీయ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ SVM కన్వీనర్‌గా దడిగం రామ్ సుధాకర్ శర్మ, తెలంగాణ టీమ్-11 సభ్యుడిగా సుబోధ్ గుప్తా పేర్లను ప్రకటించారు. రాజీవ్ అనేజాను SVM నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (NEC) సభ్యుడిగా, డి. ప్రసాద్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా, మురళీమోహన్‌ను ఆంధ్రప్రదేశ్ టీమ్-11 సభ్యుడిగా నియమించారు. సునీల్ విశ్వకర్మను మధ్యప్రదేశ్ కన్వీనర్‌గా, అమిత్ బన్సల్‌ను హర్యానా SVM కన్వీనర్‌గా ప్రకటించారు. మరికొన్ని రాష్ట్రాల బృందాలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.

వ్యాపారుల సమస్యలకు పూర్తి మద్దతు

కేంద్ర ప్రభుత్వ వ్యాపారి కళ్యాణ్ బోర్డు చైర్మన్ శ్రీ సునీల్ సంఘ్వీ తన ప్రసంగంలో దేశంలోని వ్యాపారులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారుల హక్కులు, సమస్యల పరిష్కారానికి SVM తరఫున వచ్చే డిమాండ్లు, మార్గదర్శకాలను స్వాగతించి, అవసరమైన మద్దతు అందిస్తామని తెలిపారు.

చాందినీ చౌక్ ఎంపీ శ్రీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ తాను కూడా స్వదేశీ జాగరణ్ మంచ్ కార్యకర్తనని పేర్కొన్నారు. ఇటీవల భారత్ మండపంలో నిర్వహించిన వ్యాపారి మహోత్సవ్‌ను మరింత విస్తృత స్థాయిలో దేశ, అంతర్జాతీయ వేదికలపై స్వదేశీ మేళాల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను భారత పార్లమెంటులో వ్యాపారుల ప్రతినిధిగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

తెలంగాణలో త్వరలో వ్యాపారి సమ్మేళనాలు

త్వరలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కార్యకర్తల సమ్మేళనాలు, వ్యాపారి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు SVM ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాపారుల సంక్షేమం, పురోగతి, అభివృద్ధి, వారి సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కారాలు చూపించడం వంటి అంశాల్లో SVM కీలక సంస్థగా ముందుకు సాగుతుందని వెల్లడించారు.

రెండు రోజుల సదస్సు ప్రాంగణం “జై స్వదేశీ.. జై జై స్వదేశీ”, “మేరా జిల్లా.. మేరా దేశ్” వంటి నినాదాలతో మార్మోగింది. స్వదేశీ, స్వావలంబన భారత్‌ను ప్రతిబింబించే పాటలతో సదస్సు ఉత్సాహభరితంగా సాగింది.

Please share