ఎల్బీనగర్ నియోజకవర్గం, గడ్డీఅన్నారం డివిజన్ లో స్మార్ట్ రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమం మొదలయింది. రేషన్ షాపుల వారీగా స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతోంది డివిజన్ లోని 143 144, 146 198 199 షాపులకు సంబంధించిన కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ కోదండరాం నగర్ కమ్యూనిటీ హాల్ లో పౌరసరఫరాల శాఖ ఇన్సెక్టర్ నవనీత, మాజీ కౌన్సిలర్ కే. ప్రేంనాథ్ గౌడ్ లు ప్రారంభించారు, అర్హులైన్ ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామన్నారు, ఆయా దుకాణాల రేషన్ డీలర్ల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో స్మార్ట్ కార్డులను అందచేశారు.
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సన్న బియ్యాన్ని అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని ప్రేమ్ నాథ్ గౌడ్ అన్నారు, పేదల కడుపు నింపుతున్న ఘతన తమ ముఖ్యమంత్రికే దక్కుతుందని ఆయన కొనియాడారు. అటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న తమ సర్కారు అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డును అందిస్తోందన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండండం కోసం స్మార్ట్ రేషన్ కార్డు లను అందచేస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని, అన్ని వర్గాలను ప్రజలను ఆదుకోవడమే తమ ప్రాజా ప్రభుత్వ లక్ష్మమని గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునీల్ బాబు అన్నారు.
సీనియర్ నాయకుడు పండరినాథ్ గౌడ్ ,డింపు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.https://janammata.net/bandlguda-murder/
