November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

డ్రగ్స్ కు దూరంగా ఉంటాం అవే మారియా విద్యార్థుల ప్రతిజ్ఞ

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ రామాంతపూర్ లోని అవే మారియా ఇంటర్నేషల్ స్కూల్ విద్యార్థులు ప్రమాణం చేశారు, తెలంగాణ ఈగల్ పోలీస్, యూత్ ఫర్ యాంటి కరప్షన్ సంస్థల ఆధ్వార్యంలో పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. సెక్టర్ ఎస్.ఐ మధు మాట్లాడుతూ మంచి ఆరోగ్యం, మంచి చదువు, మంచి భవిష్యత్తు కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండటం  విద్యార్థుల బాధ్యత అన్నారు. డ్రగ్స్ కు ఒకసారి అలవాటు పడితే దాని నుండి దూరం కావడం కష్టమని చట్టపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాల్సిందిగా బలవంతం చేసినా లేదా ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు అనుమానం వచ్చి ఉపాధ్యాయులకు గానీ తల్లిదండ్రులకు గానీ పోలీసులకు గానీ సమాచారం అందిచాలన్నారు. విద్యార్థులు ఎటువంటి సంకోచం లేకుండా 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చన్నారు.

   డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. చదువుపై శ్రద్ధ తగ్గుతుంది, జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా సామర్థ్యం ప్రభావితమవుతాయి. ఆరోగ్యం క్షీణించడంతో పాటు కుటుంబ సభ్యులతో సంబంధాలు, స్నేహాలు, భవిష్యత్తు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పలువురు వక్తలు విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అవే మారియా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ జయప్రతాప్, అకడమిక్ కో-ఆర్డినేటర్ బీ.ఎన్.ఎల్.శిరీష, పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్థులు పాల్గొన్నారు.https://janammata.net/commercial-activitys/

Telangana eagle force https://eagleforce.tspolice.gov.in/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share