November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

రెసిడెన్షియల్ భవనాల్లో కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తే భవనం సీల్

రెసిడెన్సియల్ పర్మిషన్ తీసుకుని వాణిజ్య అవసరాల కోసం మొత్తం భవనాన్ని లేదా కొంత భాగాన్ని వినియోగించడం ఇక పై కుదరదు దీనికిపై సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శాకాలను జారీ చేసింది,  నివాస అవసరాల కోసం కేటాయించిన ప్రాంతాలు, భవనాలను అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ప్రాంగణాల్లో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తిస్తే, చట్టప్రకారం సీలింగ్ వంటి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో అధికారులు కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని, మరికొందరిని వదిలిపెట్టే విధంగా వివక్షపూరితంగా వ్యవహరించరాదని కోర్టు హెచ్చరించింది, రెసిడెన్సియల్ భవనాలను వాణిజ్య అవసరాలను వినియోగించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్ని పిటీషన్ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కమర్షియల్ వినియోగంపై దృష్టి

ఒక ప్రాంతం లేదా భవనం అధికారికంగా నివాస అవసరాల కోసం మాత్రమే కేటాయించబడి ఉంటే, అక్కడ సంబంధిత అనుమతులు లేకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం భూ వినియోగ నిబంధనలకు  విరుద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సంబంధిత మాస్టర్ ప్లాన్, జోనల్ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులు, శాంక్షన్ ప్లాన్ , అలాగే వాణిజ్య వినియోగానికి అవసరమైన అనుమతులను పరిశీలించిన తర్వాతే అట్లాంటి భవనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

‘పిక్ అండ్ చూజ్’ విధానంపై తీవ్ర హెచ్చరిక

అక్రమ నిర్మాణాలు లేదా అనధికార వాణిజ్య కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకునే సమయంలో ఒకే విధమైన నిబంధనలను అందరికీ సమానంగా వర్తింపజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

కొన్ని భవనాలపై మాత్రమే చర్యలు తీసుకుని, అదే తరహాలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇతర భవనాలను వదిలేయడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇట్లా కొందరిపైనే చర్యలు తీసుకోవడం ద్వారా వివక్షకు అవకాశం ఇవ్వకూడదను కోర్టు పేర్కొంది, అందరికై ఒకే రకమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కేసు కోర్టులో ఉందనే కారణంతో అక్రమ వినియోగానికి రక్షణ ఉండదు

ఆస్తికి  సంబంధించి  యాజమాన్య హక్కు లేదా ఇతర వివాదాలు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో చర్యలు తీసుకోకుండా ఆపాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.  సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రతి ఇంట్లో వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సీల్ చేస్తారని కాదు, చాలా మటుకు భవనాలకు అటు నివాసంతో పాటుగా వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు. అట్లాంటి ఆస్తులను సీల్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు తన తీర్పులో పేర్గొంది.https://janammata.net/hyderabad-ganesh-2/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share