బ్యాంకుల సమ్మే నేపధ్యంలో ఆదివారం సెలవు లేదు
ఫైల్ ఫొటో
బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఐదు రోజుల బ్యాంకింగ్ వర్కింగ్ వీక్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27, ఆదివారం నాడు ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) సాధారణంగా పనిచేయనున్నాయి. బ్యాంకుల సమ్మే నేపధ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 26న శనివారం సెలవు, సెప్టెంబర్ 27న ఆదివారం సాధారణ సెలవు. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో UFBU మూడు రోజుల సమ్మె జరగనుంది. దీంతో సాధారణ పరిస్థితుల్లో బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజుల పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 30 బ్యాంకుల అర్ధవార్షిక ముగింపు (Half-Yearly Closing) కావడంతో ఈ సమ్మె సమయం కీలకంగా మారింది.
బ్యాంకుల సమ్మే వల్ల ప్రజల బ్యాంకింగ్ అవసరాలు ఎక్కువ కాలం నిలిచిపోకుండా సెప్టెంబర్ 27 ఆదివారం బ్యాంకులను తెరిచి ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. RBI కూడా ఈ మేరకు అనుమతి ఇచ్చింది.
ఏ బ్యాంకులు పనిచేస్తాయి?
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం:
- ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks)
- ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (Regional Rural Banks)
- బ్యాంకు శాఖలు, కార్యాలయాలు
- ATMలకు అనుసంధానమైన శాఖలు
- Currency Chests
సెప్టెంబర్ 27న పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.
బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏమిటి?
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలోని బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాలు ప్రధానంగా వారానికి ఐదు రోజులే బ్యాంకింగ్ సేవలు ఉండేలా Five-Day Banking అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీనితో పాటు పెన్షన్‌కు సంబంధించిన మెరుగుదలలు, పెన్షనర్లకు ఏకరీతి డియర్‌నెస్ అలవెన్స్ విధానం, NPS పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానికి మారే అవకాశం వంటి అంశాలు కూడా యూనియన్ల డిమాండ్లలో ఉన్నాయి.
ఇక Performance Linked Incentive (PLI) పథకంపై యూనియన్ల అభ్యంతరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే PLIని అబేయన్స్‌లో ఉంచినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఐదు రోజుల బ్యాంకింగ్ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 27 ఆదివారం బ్యాంకులు తెరిచి ఉండటం వల్ల ఖాతాదారులకు సమ్మెకు ముందు ఒక అదనపు బ్యాంకింగ్ రోజు లభించనుంది. https://janammata.net/power-cuts/
జనంమాట – మీ గొంతు మా వేదిక
మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.
వివరాలకు:
E Mail: Satyamediasolutions@gmail.com
Phone Number: 97045 35591
