November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు

తెలంగాణ హైకోర్టులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఎదురుదెబ్బతగిలింది, దానం పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది, దానం పై అనర్హత వేటు వేయాలంటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు వేసిన పిటీషన్ ను విచారించిన కోర్టు దానం పై అనర్హత వేటు వేస్తూ తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయినట్టుగానోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.

దానం నాగేందర్ పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి, ఏలాటి మహేశ్వర్ రెడ్డిలు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు, బీఆర్ఎస్ నుండి గెల్చిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారని అటు తర్వరా కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్ సభ కు పోటీచేశారని వారు వాదించారు, కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదని అనడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు దానంపై అనర్హత వేస్తూ తీర్పును వెలువరించింది.

కోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతించారు, కేటీఅర్ సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు, ఇటు హరీశ్ రావు కూడా న్యాయం గెల్చిందన్నారు, పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి కూడా తమ పోరాటం ఫలించిందన్నారు.

Please share