November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

వేయి కోట్లివ్వు నా ఆస్తంతా ఇచ్చేస్తా: కేటీఆర్

Photo: Mohammad Anees Qamar via Wikimedia Commons / CC BY 4.0. https://commons.wikimedia.org/w/index.php?search=Kalvakuntla+Taraka+Rama+Rao&title=Special%3AMediaSearch&type=image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. కేసీఆర్ లక్ష కోట్లను సంపాదించాడని, వేయి ఎకరాల్లో ఫాంహౌస్ నిర్నించుకున్నరాని అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు 67 ఎకరాలు ఉందని చెప్పడతో ఆయనవన్నీ అబద్దాలు అని తేలిపోయిందన్నారు. తమకు ఒక వేయి కోట్లు ఇస్తే తమకున్న ఆస్తులన్నింటినీ ఇచ్చేస్తామని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్మాలా కార్ కేసులో కోర్టుకు హాజరైన తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

     తమను ఇబ్బందులు పెట్టడం కోసం ఈ ఫార్ములా కేసును సృస్టించి తనపై కేసులు పెట్టారని, గతంలో చెప్పినట్టుగానే ఈ కేసులో ఎటువంటి పసలేదన్నారు, కేవలం కక్షసాధింపు కోసమే పెట్టిన కేసని అన్న కేటీఆర్ ఎన్నిసార్లయినా వాయిదాలకు వస్తానన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ను అంతర్జాకీ. స్థాయికి తీసుకుని పోవడానికి నాడు ఈ ఫార్ములా రేసులను హైదరాబాద్ లో నిర్వహించినట్టు కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి లండన్ కు వెళ్లి ఫార్ములా కేసుల నిర్వహణను పరిశీంచి వస్తున్నారని తమ ప్రభుత్వం చాలా ముందే ఫార్ములా రేసులు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లామన్నారు.

    ముఖ్యమంత్రికి ఏ మాత్రం పరిపాలను చేతపోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి వాళ్లకి సమాధానం చెప్పుకునే దమ్ములేక ప్రజల దృష్టిని మరల్చడంకోసం డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను గురించి ఎప్పటికప్పుడు ఎన్నికల అఫడవిట్ లో ప్రజల ముందు పెట్టాడడని ఆయనతో పాటుగా తాను కూడా ఆస్తుల వివరాలను వివరించానని ఇప్పుడు ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా తాను ఏదో విషయాన్ని కనిపెట్టినట్టు బిల్డప్ లు ఇస్తున్నాడని విమర్శించారు. వేయి ఎకరాలు అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తాడని ఆయన ప్రశ్నించారు.

     అసెంబ్లీలో 22ఏ పై ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తమమీద తమ పార్టీ నాయకుల మీద లేనిపోని అభాండాలు వేస్తూ ముఖ్యమంత్రి రాక్షస ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలనను ప్రజలు చూదరించుకుంటున్నారని ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తునారన్నారు, అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి సర్కారు చేసిన ఒక్క మంచిపనైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు, అబద్దాలు చెప్పడం, బూతులు మాట్లాడడం మినహా రేవంత్ రెడ్డి చేస్తోంది ఏమీలేదన్నారు.

    ఫార్ములా కార్ రేస్ అంటూ తమపై బురద చల్లే ప్రయత్నం చేశారు అది విఫలం కావడం తో ఇప్పుడు ఆస్తులు అంటూ మరో కొత్తనాటకానికి తెరతీశారని ఎన్ని విచారణలు జరిపినా ఎన్ని సిట్ లు వేసినా తమకు వచ్చే ఏమీలేదన్న కేటీఆర్ ఎటువంటి తప్పు చేయని తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  రేవంత్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆయన్ను ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. తమపై విమర్శలు చేయడానికి ఉపయోగించే సమయంలో కనీసం కొంతయిన పాలనపై పెట్టాలని హితవుపలికారు.https://janammata.net/hareesha-rao/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share