November 27, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

రోడ్డు ఆక్రమణలు

ప్రతి గురువారంతో పాటు పండుగ రోజుల్లో దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం (Dilsukhnagar Saibaba Temple) రోడ్డును మూసివేస్తుండటంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పండుగలు జరుపుకోవడం, దేవుడిని పూజించడం మంచిదే. అయితే భక్తుల సౌకర్యం పేరుతో ప్రధాన రోడ్డును తరచూ మూసివేయడం వల్ల సాధారణ ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పండుగ రోజుల్లో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోంది.

గుడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసమే రోడ్డును మూసివేస్తున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి దేవాలయం సమీపంలోని దుకాణదారులు రోడ్డులో దాదాపు సగం వరకు ఆక్రమించుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. దుకాణదారులు రోడ్డును ఆక్రమించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఆక్రమణలను నియంత్రించగలిగితే రోడ్డును మూసివేయాల్సిన అవసరం ఉండదు. Dilsukhnagar Saibaba Temple) .

భక్తుల విశ్వాసాలకు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రోడ్డును మూసివేయడం కాకుండా, దుకాణాల ఆక్రమణలను నియంత్రించి ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి.

కృష్ణ, సరూర్ నగర్

https://www.saisansthan.in/contactUs.jsp

https://janammata.net/hyderabad-ganesh/

Please share