November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

నచ్చచెప్పినా వినకపోయేసరికి కాల్చి చంపారు.. Kulgam Encounter

Kulgam Encounter ఓ తీవ్రవాది పోలీసు కాల్పుల్లో గాయపడి మసీదులో దాక్కున్నాడు, మసీదును చుట్టుముట్టిన భద్రత బలగాలు చాలాసేపు ఆ ఉగ్రవాదిని లొంగిపోవాల్సిందిగా బతిమిలాగాడాయి, ఉగ్రవాది కి వీడియో కాల్ చేసి మరీ మన జవాన్లు లొంగిపోవాలంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎంత చేప్పినా వినకపోవడం, లోపలికి నుండి జవాన్ల పైకి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. దక్షిణ కశ్మీర్‌లో క్రియాశీలంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాద కమాండర్‌గా భావిస్తున్న మహమ్మద్ లతీఫ్ భట్ (23) భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. బుధవారం కుల్గామ్ జిల్లాలోని జంగల్‌గామ్ గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా అధికారులు వెల్లడించారు.

మసీదులో చిక్కుకున్న ఉగ్రవాది

బుధవారం ఉదయం భద్రతా బలగాలు లతీఫ్ భట్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో అతడు జంగల్‌గామ్ గ్రామంలోని ఓ మసీదులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. లొంగిపోవాలని అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ అతడు నిరాకరించినట్లు సమాచారం. చివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో లతీఫ్ భట్ హతమయ్యాడు.Kulgam Encounter

ఏడాది కాలంగా పోలీసులకు చిక్కకుండా..

కుల్గామ్ జిల్లాలోని ఖ్రేవాన్ గ్రామానికి చెందిన లతీఫ్ భట్ గతంలో వడ్రంగి పని చేసేవాడు. 2025 నవంబర్‌లో అతడు కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరినట్లు భద్రతా సంస్థలు అనుమానించాయి.

లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా పేర్కొంటున్న కశ్మీర్ రివల్యూషన్ ఆర్మీలో అతడు చేరినట్లు గతంలో సోషల్ మీడియాలో ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి భద్రతా బలగాలు అతడి కోసం గాలిస్తున్నాయి.Kulgam Encounter

పలు దాడుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు

దక్షిణ కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో లతీఫ్ భట్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. జులై 31న కుల్గామ్‌లోని ఇటుక బట్టీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికుల హత్య, జులై 22న జమ్మూకశ్మీర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ హత్య ఘటనల్లో అతడి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి.

అలాగే నవంబర్ 11న కుల్గామ్‌లోని అఖ్రాన్ గ్రామంలో సీఆర్‌పీఎఫ్ శిబిరంపై జరిగిన దాడిలోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

సహచరుడు హతం.. రెండు రోజులకే లతీఫ్ అంతం

లతీఫ్ భట్ సహచరుడిగా భావిస్తున్న ఉమర్ నిసార్ దార్‌ను రెండు రోజుల క్రితం కుల్గామ్‌లోని లరూ బైపాస్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ సమయంలో భద్రతా బలగాల వలయం నుంచి లతీఫ్ తప్పించుకున్నాడు. దీంతో అతడి కోసం గాలింపును మరింత ముమ్మరం చేశారు.

గతంలోనూ పలుమార్లు భద్రతా బలగాల వలయం నుంచి తప్పించుకున్న లతీఫ్.. స్థానిక ప్రాంతాలపై అవగాహన, జనసమూహాల్లో కలిసిపోయే సామర్థ్యంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తగ్గుతున్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య

జమ్మూకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గినట్లు భద్రతా సంస్థల గణాంకాలు సూచిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో 50 నుంచి 60 మంది స్థానిక ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉండగా, 2025 మే నాటికి ఆ సంఖ్య 17కు పడిపోయింది. వీరిలో 14 మంది కశ్మీర్‌లో, ముగ్గురు జమ్మూ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

లతీఫ్ భట్ హతంతో జమ్మూకశ్మీర్‌లో స్థానికంగా శిక్షణ పొందిన క్రియాశీల ఉగ్రవాదుల నెట్‌వర్క్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

Please share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *