November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చేసింది: మందాకిని

Photo: Bollywood Hungama via Wikimedia Commons / CC BY 3.0

   షార్జాలో జరిగిన భారత పాకిస్థాన్ మ్యాచ్ లో ముంబాయి డాన్ దావుద్ ఇబ్రహీం తో పాటుగా నాటి టాప్ హీరోయిన్ మందాకినీ కనిపించిన దృశ్యాలు అప్పట్లో పెను సంచలనాన్ని కలిగించాయి. దానికి గురించి ఆమె మాట్లాడారు,   అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం (Dawood Ibrahim) కలిసి షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూసిన ఫొటో తన జీవితాన్నే మార్చేసిందని నటి మందాకిని (Mandakini) అన్నారు. ఆ ఫొటో తన జీవితాన్నే మార్చేసిందన్నారు. ఆ తరువాత తన కెరీర్ దారుణంగా దెబ్బతినిందని మందాకిని వివరించారు. తాజాగా ఒక ఇంటర్వ్యులో ఆమె ఈ విషయం గురించి వివరించారు. కెరీర్ పరంగా తాను ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఒక షో కోసం దుబాయ్ కి వెళ్లాల్సి వచ్చిందని అదే సమయంలో క్రెకెట్ చూడడానికి స్టేడియంకు వెళ్లిన సమయంలో దావుద్ తనతో మాట్లాడాడని చెప్పారు. అసలు ముందుగా తాను మ్యాచ్ కు వెళ్లాలని కానీ దావుద్ ను కలవాలని కానీ అనుకోలేదన్నారు. పూర్తిగా అది తన ప్రమేయం లేకుండా జరిగిపోయిందన్నారు.

    ఈ విషయం గురించి తాను ఎన్ని వివరణలు ఇచ్చినా అది ప్రజల మనస్సులో సరిగ్గా నాటుకోలేదని తాను దావుద్ కలిసి విషయమే ప్రజలకు గుర్తుండిపోయిందని ఈ సంఘటన జరిగిన దాదాపు 35 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ప్రజలు దాని గురించే అడుగుతుంటారని అన్నారు. రాంతేరీ గంగా మైలి సినిమాతో తాను చిత్రసీమలోకి అడుగుపెట్టినట్టు ఆమె చెప్పారు, రాజ్ కపుర్ నిర్మించిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తమకు బాగా ఆఫర్ లు వచ్చాయని హిందీతో పాటుగా తెలుగు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించినట్టు ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా పీక్ లో ఉన్న సమయంలో జరిగిన ఘటన పరిస్థితిని పూర్తిగా మార్చెసిందన్నారు.

     ఒక్కసారిగా తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయని చెప్పారు. ఒక్కోసారి మన చేతిలో ఏమీ ఉండదని మనం తేరుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్నారు. బాలీవుడ్ కు అండర్ వరల్డ్ తో సంబంధాల గురించి తనకు ఏమీ తెలియదని కేవలం వాటి గురించి పత్రికల్లో చదవడం మినహా తనకు వాటి పట్ల ఎట్లాంటి అవగాహన లేదని ఆమె స్పష్టం చేశారు. షార్జాలో తప్ప అంతుకు ముందు కానీ ఆ తరువాత కానీ దావుడ్ ను ఎప్పుడూ కలవలేదని మందాకిని స్పష్టం చేశారు.

    హిమాచల్ లో జన్మించిన మందాకిని 16 సంవత్సరాలకే సినిమా హీరోయిన్ అయ్యారు. దావుడ్ వ్యవహారం తరువాత అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులోనూ సింహాసనం, భార్గవ రాముడు చిత్రాల్లో నటించిన ఆమె బౌద్దమతాన్ని స్వీకరించి ఎక్కువగా దలైలామా ఆశ్రమంలో యోగా గురువుగా ఉన్నారు. ప్రస్తుతం తాను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాన్ని మీడియాకు చాలా దూరంగా ఉంటున్నట్టు మందానికి తన ఇంటర్వ్యూలో చెప్పారు.https://janammata.net/september-17th/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share