November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ – హాట్ టాపిక్ గా ఓ పాత్ర

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురించే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. సినిమా కథ, నాని పాత్ర, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ చిన్న పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. అదే ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర. ఈ పాత్ర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉందనే చర్చ థియేటర్లలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది.. దీంతో ప్యారడైన్ సినిమా లో కేసీఅర్ ట్రెండింగ్ గా మారింది.

ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ అంటూ చర్చ?

‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి కనిపించే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర నడవడి, డైలాగ్ డెలివరీ, మాట్లాడే తీరు, కొన్ని మేనరిజమ్స్ కేసీఆర్‌ను గుర్తు చేస్తున్నాయనే అభిప్రాయాలు సినిమా చూసిన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. కొన్ని సినిమా రివ్యూలు కూడా ఈ పాత్రను కేసీఆర్‌ను పోలిన క్యారెక్టర్‌గా పేర్కొన్నాయి. 

మరోవైపు, రాజకీయంగా భిన్నమైన వర్గాలకు చెందిన సోషల్ మీడియా యూజర్లు ఈ సన్నివేశాన్ని తమ తమ దృక్కోణాల్లో విశ్లేషిస్తూ పోస్టులు చేస్తున్నారు. కొందరు ఈ పాత్రను సినిమాలోని అణగారిన వర్గాల పోరాటంతో అనుసంధానిస్తుండగా, మరికొందరు దీనిని రాజకీయ వ్యంగ్యంగా చూస్తున్నారు. అయితే దర్శకుడు లేదా చిత్రబృందం ఈ పాత్రను అధికారికంగా కేసీఆర్‌ను ఉద్దేశించి రూపొందించామని ప్రకటించినట్లు ఆధారాలు లేవు.

సినిమాలో అసలు కథేంటి?

‘ది ప్యారడైజ్’ కథ 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంగా సాగుతుంది. సవారీ అనే వర్గానికి చెందిన ప్రజలకు గుర్తింపు, పౌరసత్వం లేకుండా వారు ఎదుర్కొనే పరిస్థితులు, వారి కోసం జడల్ అనే యువకుడు చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. నాని జడల్ పాత్రలో కనిపించగా, సోనాలి కులకర్ణి సమ్మక్కగా నటించారు. మోహన్ బాబు శికంజా మాలిక్ పాత్రలో, రాఘవ్ జుయల్ మరో కీలక పాత్రలో కనిపించారు.

సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 24, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. 

ప్రియదర్శి పాత్రపై ఇంత ఆసక్తి ఎందుకు?

సినిమా మొత్తంలో చాలా తక్కువ సమయం కనిపించే పాత్ర అయినప్పటికీ.. ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఓ రాజకీయ నాయకుడి శైలి గుర్తుకు రావడం వల్ల శంకరన్న పాత్ర ప్రత్యేకంగా చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా ప్రెస్‌మీట్‌లలో మాట్లాడే తీరు, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌ను పోలి ఉన్నాయని కొన్ని రివ్యూలు పేర్కొన్నాయి. 

అందుకే ప్రస్తుతం సినిమా కథ కంటే ఈ చిన్న పాత్ర చుట్టూనే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ కనిపిస్తోంది. రాజకీయ అభిమానులు తమ తమ అభిప్రాయాలను పోస్టుల రూపంలో పంచుకుంటుండటంతో ఈ సన్నివేశానికి సంబంధించిన చర్చ మరింత విస్తరిస్తోంది.

‘ది ప్యారడైజ్’ విశేషాలు

  • హీరో: నాని
  • హీరోయిన్: కయాదు లోహర్
  • కీలక పాత్రలు: మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, ప్రియదర్శి తదితరులు
  • దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల
  • నిర్మాత: సుధాకర్ చెరుకూరి
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయి
  • ఎడిటింగ్: నవీన్ నూలి
  • నిర్మాణ సంస్థ: SLV Cinemas
  • విడుదల తేదీ: 24 సెప్టెంబర్ 2026
  • నేపథ్యం: 1980ల సికింద్రాబాద్
  • జానర్: పీరియడ్ యాక్షన్ డ్రామా

సినిమా విడుదలైన రోజే ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రపై ఇంతటి చర్చ రావడం ‘ది ప్యారడైజ్’కు మరో రకమైన సోషల్ మీడియా ట్రెండ్‌ను తీసుకొచ్చింది. సినిమా కథలో ఆ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో మాత్రం అదే పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది.

Please share