November 27, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

క్యూర్ చట్టం 2026 వల్ల లాభమా నష్టమా..!

హైదరాబాద్‌ నగర పాలనను సమూలంగా మార్చే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్‌–2026, అంటే CURE Bill 2026ను తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 12, 2026న ఆమోదించింది. ఈ బిల్లు 1955 నాటి GHMC చట్టానికి బదులుగా కొత్త సమగ్ర పాలనా వ్యవస్థను తీసుకురావడానికి ఉద్దేశించింది. 

CURE అంటే ఏమిటి?

CURE అంటే Core Urban Region.

హైదరాబాద్‌ విస్తీర్ణం, జనాభా, ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగడంతో ఒకే నగరానికి సంబంధించిన పాత పాలనా చట్టాలు సరిపోవడం లేదన్న అభిప్రాయంతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు అదే క్యూర్ చట్టం 2026 .

CURE పరిధిలో ప్రస్తుతం మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి:

  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)
  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)
  • మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)

ఎందుకు కొత్త చట్టం అవసరమైంది?

హైదరాబాద్‌ చుట్టూ నగరం వేగంగా విస్తరించడంతో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, ట్రాఫిక్, వరదల నియంత్రణ, చెత్త నిర్వహణ, పర్యావరణం వంటి అంశాల్లో అనేక ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి.

వీటి మధ్య సమన్వయం పెంచి నగరాన్ని ఒక సమగ్ర మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిర్వహించడమే క్యూర్ చట్టం 2026 ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది?

CURE వ్యవస్థలో ఆస్తిపన్ను, భవన నిర్మాణ నిబంధనలు, పార్కింగ్, ప్రకటనలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో మరింత ఏకరీతి విధానాలు రావచ్చని భావిస్తున్నారు.

ప్రత్యేకంగా భవన నిర్మాణాల్లో పర్యావరణ ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రీన్ బిల్డింగ్స్, వర్షపు నీటి సంరక్షణ, నిర్మాణ సమయంలో దుమ్ము-శబ్ద కాలుష్య నియంత్రణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.

ఆస్తిపన్ను విషయంలో ఏం మారింది?

డ్రాఫ్ట్ బిల్లులో ఆస్తిపన్ను పెంపునకు సంబంధించిన నిబంధనలపై పెద్ద చర్చ జరిగింది. అసెంబ్లీలో ఆమోదమైన తుది బిల్లులో ప్రతిపాదిత గరిష్ఠ వార్షిక ఆస్తిపన్ను పెంపు పరిమితిని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.అందువల్ల CURE చట్టం అంటే కేవలం “కొత్త మున్సిపల్ చట్టం” మాత్రమే కాదు. హైదరాబాద్‌ భవిష్యత్‌ పట్టణ పాలన, మౌలిక వసతులు, పర్యావరణం, పన్నులు, నిర్మాణ నియంత్రణ వంటి అనేక అంశాలను ప్రభావితం చేసే కొత్త వ్యవస్థ.

CURE అమలులోకి వచ్చిన తర్వాత తమ ప్రాంతానికి సంబంధించిన ఆస్తిపన్ను, భవన అనుమతులు, పారిశుధ్యం, రోడ్లు, నీటి సరఫరా, పార్కింగ్, నిర్మాణ నిబంధనలు వంటి అంశాల్లో మార్పులు ఏ విధంగా అమలవుతున్నాయో ప్రజలు గమనించాలి.

అలాగే కొత్త చట్టంలోని నిబంధనలు, ప్రభుత్వం జారీ చేసే నియమావళి, మార్గదర్శకాలు విడిగా పరిశీలించడం ముఖ్యం. చట్టం ఆమోదం పొందడం ఒక దశ కాగా, దాని కింద రూపొందే నిబంధనలు రోజువారీ పౌర సేవలపై మరింత స్పష్టమైన ప్రభావం చూపుతాయి.https://janammata.net/f16/

Please share