అసెంబ్లీ వేదికగా ఎల్.బీ.నగర్ వాసులకు తీపికబురు చెప్పిన సీఎం
శాసనసభలో జరిగిన సెక్షన్ 22-ఏ (22A) భూ వివాదాలు , నిషేధిత ఆస్తుల జాబితాపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ఎల్.బీ.నగర్ వాసులకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జీఓ నెంబర్ 118 (G.O. Ms. No. 118)ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్ల సమస్యలతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద ఊరట లభించనుంది.
జీఓ 118 నేపథ్యం
గతంలో (2022 అక్టోబర్ చివరిలో) వెలువడిన జీఓ 118 ప్రకారం రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను 1998 నాటి 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి క్రమబద్ధీకరించడానికి మార్గం సుగమం చేశారు.
- క్రమబద్ధీకరణ పరిమితి: ఆక్రమణలో లేదా సమస్యలో ఉన్న భూములు/ఇళ్ల స్థలాలను గరిష్టంగా 1,000 చదరపు గజాల (Sq Yards) వరకు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు.
- నామమాత్రపు ధర: పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేవలం చదరపు గజానికి రూ. 250/- నామమాత్రపు రుసుమును నిర్ణయించారు.
- ఈ వెసులుబాటు ద్వారా సుమారు 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ (ULC) సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీఓ 118 పరిధిలోకి వచ్చే ప్రధాన కాలనీలు:
- మాధవ నగర్ కాలనీ (Madhava Nagar Colony)
- శ్రీనిధి కాలనీ (Srinidhi Colony)
- సరూర్‌నగర్ జనార్ధన్ రెడ్డి నగర్ కాలనీ (Janardhan Reddy Nagar Colony)
- కర్మాన్‌ఘాట్ మల్లికార్జున హిల్స్ (Mallikarjuna Hills)
- అవెన్యూ హోమ్స్ – అవంతి కాలనీ (Avenue Homes / Avanthi Colony)
- మారుతి నగర్ / తూర్పు మారుతి నగర్ (Maruthi Nagar / East Maruthinagar)
- చంపాపేట్ మల్లారెడ్డి / రాజిరెడ్డి కాలనీ (Mallreddy / Rajireddy Nagar Colony)
- వినాయక నగర్ కాలనీ (Vinayaka Nagar Colony)
- బాలాజీ నగర్ (Balaji Nagar)
- శ్రీరామ హిల్స్ కాలనీ (Srirama Hills Colony)
- వివేకానంద నగర్ కాలనీ (Vivekanandanagar Colony)
- రగడ ఎన్క్లేవ్ (Ragala Enclave)
- పద్మావతి నగర్ (Padmavati Nagar)
- మన్సూరాబాద్ కమలానగర్ (Kamalanagar)
- బ్యాಂಕ್ కాలనీ (Bank Colony)
- కాస్మోపాలిటన్ కాలనీ (Cosmopolitan Colony)
- సామానగర్ కాలనీ (Samanagar Colony)
- సీబీఐ కాలనీ (CBI Colony)
- విజయానగర్ కాలనీ (Vijayanagar Colony)
- రంగారెడ్డి సాగర్ కాంప్లెక్స్ (Rangareddy Sagar Complex)
- శ్రీపురం కాలనీ (Sripuram Colony)
- వైదేహి నగర్, హయత్‌నగర్ (Vaidehi Nagar)
- బి.ఎన్. రెడ్డి నగర్ (B.N. Reddy Nagar)
- సాహెబ్‌నగర్ శ్రీరామ్ నగర్ కాలనీ (SriRam Nagar Colony)
- ఎస్కేడీ నగర్ (SKD Nagar)
- సాయి నగర్ కాలనీ (Sai Nagar Colony)
- కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ (Co-operative Bank Colony)
