November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

మండలి నుండి తాతామధు, నవీన్ రెడ్డి సస్పెండ్

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి లను తెలంగాణ మండలి సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఆమోదం లభించడంతో వారిద్దిరినీ సావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలో ప్రకటించారు.

స్పీకర్ పై వ్యాఖ్యలపై నమోదయిన కేసు నేపధ్యంలో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు, అయితే కోర్టు మండలి సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో వీరిద్దరికీ రిమాండ్ విధించడానికి అనుమతించలేదు, వెంటనే వారికి బెయిల్ మంజూరు కావడం ఇటు ఈ సెషన్ వరకు వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ మండలి తీర్మానం ఆమోదించడం విశేషం.

Please share