November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

హాట్ హాట్ గా తెలంగాణ పాలిటిక్స్ – మాటల మంటలు

తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కింది… రెండో రోజూ రచ్చ రచ్చ!

తెలంగాణ పాలిటిక్స్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రేగిన వివాదం రెండో రోజుకూ కొనసాగడంతో సభలో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ పక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు దూషించారన్న ఆరోపణలతో, వారి సభ్యత్వాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్ష సభ్యులు రెండో రోజు కూడా బలంగా డిమాండ్ చేశారు. స్పీకర్‌ను దూషించడం సహించరాని విషయమని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే హరీశ్ రావు మాట్లాడినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. బీఆర్ఎస్ కనీసం విచారం వ్యక్తం చేయలేదని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు, స్పీకర్ పై వ్యాఖ్యల పై నమోదైన కేసు నేపథ్యంలో మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.

అసెంబ్లీకి వచ్చే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును కాంగ్రెస్ తప్పుబట్టింది. మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కొన్ని ఫొటోలను పోలీసులు విడుదల చేశారు, ఇది తెలంగాణ పాలిటిక్స్‌లో మరో దుమారానికి కారణమైంది.

మరోవైపు, స్పీకర్‌పై బీఆర్ఎస్ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ ముట్టడికి కాంగ్రెస్ దళిత నాయకులు పిలుపునివ్వడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఫాం హౌస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. కేసీఆర్ చావును తాము కోరుతున్నామని, ఆయన ఫాం హౌస్ ముందు చావు డప్పు కొడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా భగ్గుమన్నాయి.

ఎర్రవల్లి ఫాం హౌస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్‌ను బోయినపల్లి, హరీశ్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పోలీస్ స్టేషన్ల ఎదుట కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బాహాబాహీకి దిగారు, తెలంగాణ పాలిటిక్స్‌ లో ఈ ఘటనలు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. https://janammata.net/telangana-assembly/

Please share